ఆంధ్ర‌ప్ర‌దేశ్  మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి చెందిన విష‌యాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌కు స‌మాచారం అందించారు. రోశ‌య్య కుమారుడితో ఫోన్‌లో మాట్లాడారు రేవంత్‌రెడ్డి. ఢిల్లీ నుంచి ఇప్ప‌టికే హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరిన‌ట్టు స‌మాచారం అందించారు. నేరుగా శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ నుంచి రోశ‌య్య నివాసానికి చేరుకోనున్న‌ట్టు వెల్ల‌డించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.

రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు రోశ‌య్య పార్థివ‌దేహాన్ని. అనంత‌రం జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. రోష‌య్య మృతి వార్త తెలుసుకోగానే ఇప్ప‌టికే ఉమ్మ‌డి రాష్ట్రాల సీఎంలు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు  రోష‌య్య‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. కొంత మంది నేరుగా ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుని వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీల‌క ప‌ద‌వుల‌ను అధిరోహించి మ‌ర‌ణించేంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతాను అని పేర్కొన్న‌ట్టు కాంగ్రెస్ నేత‌లు గుర్తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: