ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య మృతి చెందడం బాధ‌క‌ర‌మ‌ని, ఆయ‌న‌కు ఉన్న బంధం విడ‌దీయరానిది అని పేర్కొన్నారు కేవీపీ రామ‌చంద్రారావు. కొణిజేటి రోశ‌య్య మృతి చెందార‌నే వార్త తెలుసుకోగానే వెంట‌నే కేవీపీ సంతాపం ప్ర‌క‌టించి త‌న బంధాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా రోశ‌య్య‌తో తన‌తో ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ని, రోశ‌య్య‌కు, నాకు, వైఎస్‌కు విడ‌దీయ‌రాని బంధం ఉన్న‌ద‌ని గుర్తు చేసారు కేవీపీ.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూడా రోశ‌య్య నుంచే క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నేర్చుకున్నార‌ని కేవీపీ గుర్తుకు తీసుకొచ్చారు. రోశ‌య్య గొప్ప కాంగ్రెస్ వాది అని, ఆయ‌న మ‌ర‌ణం మాత్రం తీర‌ని లోటు అని వెల్ల‌డించారు కేవీపీ రామ‌చంద్రారావు. నిద్ర‌లోనే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు పేర్కొన్నార‌ని చెప్పారు. రోశ‌య్య కేవ‌లం ముఖ్య‌మంత్రి, గ‌వ‌ర్న‌ర్ మాత్ర‌మే కాకుండా స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు అయిన ఎన్‌జీ రంగా శిష్యుడు అని పేర్కొన్నారు కేవీపీ. రేపు గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్ధం రోశయ్య పార్టీవదేహాన్ని ఉంచుతామ‌ని.. ఆ త‌రువాత గాంధీ భ‌వ‌న్ నుంచి అంతి‌మ యాత్ర  ఆరంభం అవుతుంద‌ని వెల్ల‌డించారు కేవీపీ

మరింత సమాచారం తెలుసుకోండి: