ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య అంత్య‌క్రియ‌లు అధికారికంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈమేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అధికార లాంఛ‌నాల‌తో ఆదివారం నాడు బారీ బందోబ‌స్తు మ‌ధ్య జూబ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో రోశ‌య్య అంత్య‌క్రియ‌లు తెలంగాణ  ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌నున్న‌ది. ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు  ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇప్ప‌టికే జారీ చేసిన‌ది. అదేవిధంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు 15వ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన రోశ‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అంత్య‌క్రియ‌ల‌ను అధికారికంగా నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కూడా అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌నున్న‌ట్టు స‌మాచారం. కానీ అధికారికంగా మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు మ‌హాప్ర‌స్థానంలో  ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌కు ప్ర‌గాడ సానుభూతిని ప్ర‌క‌టించారు.  


 


మరింత సమాచారం తెలుసుకోండి: