ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య మృతి చెందాడ‌ని తెలిసిన వెంట‌నే సీఎం కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. ఉద‌యం నోవాటెల్ హోట‌ల్‌లో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ఉన్న సంద‌ర్భంగా చేరుకోలేక‌పోయిన‌ట్టు.. ఆ త‌రువాత మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు రోశ‌య్య నివాసానికి చేరుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంత‌రం ప్ర‌గాఢ‌మైన సానుభూతిని ప్ర‌క‌టించారు.

సీఎం కేసీఆర్  బ‌ల్కంపేట‌లోని మాజీ సీఎం రోశ‌య్య నివాసానికి చేరుకుని  పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. కేసీఆర్ తో పాటు మంత్రి హ‌రీశ్‌రావు కూడా ఉన్నారు. రోశ‌య్య భీష్మాచారి అనే విష‌యాన్ని ప్ర‌ముఖులు ట్విట్స్ కూడా చేసారు. సంవ‌త్స‌రంన్న‌ర కాలం పాటు ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.  ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని.. కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యాన్ని నింపారు. రోశ‌య్య సేవ‌ల‌ను గుర్తు చేసారు. రోశ‌య్య మృతి చాలా బాధ‌క‌రం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: