ఇండోనేషియాలో మ‌ళ్లీ ప‌లు ప్రాంతాల‌లో భారీ భూకంపం సంభ‌వించిన‌ది. ఆదివారం ఉద‌యం హ‌ల్మ‌హెరాకు ఉత్త‌రంలో 6.2 తీవ్ర‌తతో భూకంపం వ‌చ్చింది. భూ అంత‌ర్భాగంల 151 కిలోమీట‌ర్ల లోతులో ప్ర‌కంప‌న‌లు వచ్చాయి అని యూరోపియ‌న్ మెడిట‌రేనియ‌న్ సిస్మోలాజిక‌ల్ సెంట‌ర్ వెల్ల‌డించింది. భూకంప‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఎలాంటి ప్రాణ న‌ష్టం  జర‌గ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఈరోజు ఉద‌యం 5.16 గంట‌ల‌కు టోబెల్‌లో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కంపించింది.

టొబెలోకు భూకంప‌కేంద్రం 259 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ద‌ని యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే తెలిపిన‌ది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలు పై 6.2గా న‌మోదు అయిన‌ద‌ని వెల్ల‌డించింది. భూ అంత‌ర్భాగంలో 174.3 కిలోమీట‌ర్ల లోతులో ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి అని పేర్కొంది. నిన్న శ‌నివారం మ‌ధ్యాహ్నం  తూర్పు జావా ప్రావిన్స్‌లో అగ్నిప‌ర్వ‌తం పేలిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మ‌ర‌ణించ‌గా.. 40 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. అయితే స‌మీపంలోని గ్రామాలు, న‌గ‌రాల‌లోని ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించిన‌ట్టు అక్క‌డి అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: