ఈ మ‌ధ్య‌కాలంలో ముఖ్యంగా భార‌త్‌లో భూకంపాలు త‌రుచుగా సంభ‌విస్తూనే ఉన్నాయి. ఇటీవ‌ల తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో కూడా స్వ‌ల్పంగా భూమి కంపించిన విష‌యం విధిత‌మే.  ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అయిన మిజోరాం, మ‌ణిపూర్‌ల‌తో పాటు హిమాల‌య రీజియ‌న్‌, అండ‌మాన్ నికోబార్ దీవుల‌లో భూకంపాల‌ని సంభ‌విస్తున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై త‌క్కువ తీవ్ర‌త‌తో స‌గ‌టున 4.0 తీవ్ర‌త‌తో ఎక్కువ‌గా భూకంపాలు వ‌స్తున్నాయి. దీని మూలంగా పెద్ద‌గా ఆస్తి, ప్రాణ న‌ష్టాలు మాత్రం ఏమి జ‌ర‌గ‌డం లేదు.

తాజాగా మరొక‌సారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం భూకంపం  సంభ‌వించిన‌ది.  ఇవాళ రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూమి కంపించిన‌ది. ఉత్తరాఖండ్ లోని తేహ్రీ గర్వాల్ ప్రాంతంలో  అక‌స్మాత్తుగా భూకంపం వచ్చిన‌ది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృత‌మైంద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్ల‌డించిన‌ది. ఇదిలా ఉండ‌గానే ఇండోనేషియాలో కూడా భూకంపం తాకిన‌ది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం  ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిందని సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ పేర్కొన్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: