సాధార‌ణంగా రోడ్డుపై వెళ్లే బైక్‌, కారు, బ‌స్సు లాంటి ఇత‌ర వాహ‌నాల‌కు పంక్చ‌ర్లు అవుతుంటాయి.  అలా జ‌రిగిన‌పుడు చిన్న వాహ‌నాలు అయితే ఒక్క‌రే నెట్టుకుంటూ.. అదే కాస్త పెద్ద వాహ‌నాలు కొంత మంది క‌లిసి తోసుకుంటూ వెళ్లాల్సి వ‌స్తుంది.  అదే ఆకాశంలో ప్ర‌యాణం చేసే విమానం టైర్‌కు పంక్చ‌ర్ అయితే మ‌రీ ఏమి చేయాలి.   ర‌న్‌వే మీద ఉన్న విమానం ముందుకు క‌ద‌లాలంటే త‌ప్ప‌నిస‌రిగా టైర్లు ఉండాల్సిందే.  పంక్చ‌ర్ అయితే క‌నీసం కొంచెం కూడా ముందుకు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి వ‌స్తుంది.  దీంతో చేసేది ఏమిలేక విమానంలోని ప్ర‌యాణికులంద‌రూ దిగి త‌లోచేయ్యేసి ఆ విమానాన్ని ముందుకు తోసారు.  

కాస్త చిన్న విమానం కావ‌డంతో అది కాస్త‌ ముందుకు క‌దిలింది.  అదే పెద్ద విమానం అయితే మాత్రం ప‌రిస్థితి ఏమిటి..  అని ప్ర‌శ్నిస్తున్నారు.  ఈ  విమాన‌మును నెట్టిన సంఘ‌ట‌న నేపాల్‌లో  చోటుచేసుకున్న‌ది.   నేపాల్‌లోని టారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ర‌న్‌వేపై పంక్చ‌ర్ అవ్వ‌డంతో ప్ర‌యాణికులు కొంత‌దూరం తోసుకుంటూ వెళ్లారు.  ఈ విమానానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: