భార‌త దేశంలో ఒమిక్రాన్ దేశాలు రోజు రోజుకు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న‌టి వ‌ర‌కు నాలుగు కేసులు న‌మోదు అవ్వ‌గా.. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో  మ‌రొక ఒమిక్రాన్  కేసు న‌మోదయింది. తొలుత క‌ర్నాట‌క‌లో ఇద్ద‌రికీ ఒమిక్రాన్ సోకింది. ఆ త‌రువాత నిన్న గుజ‌రాత్‌లో ఒక‌టి, మ‌హారాష్ట్రలో ఒక‌టి కేసు న‌మోదైంది. వీటితో క‌లిపి ఆదివారం ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కొత్త వేరియంట్ కేసులు 5 కు చేరాయి. అయితే ప్ర‌స్తుతం భార‌త్ కు చెందిన బాధితుడు ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

మ‌రోవైపు కేంద్రం 5 రాష్ట్రాల‌కు లేఖ కూడా రాసింది. కొవిడ్ కేసులు, వార‌పు పాజిటివిటీ రేటు, మ‌ర‌ణాలు, పెరుగుతుండ‌డంతో 5 రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్ర‌మ‌త్తం చేసిన‌ది. క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఒడిషా, మిజోరం, జ‌మ్మూ-కాశ్మీర్ ల‌కు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి నిన్న ఓ లేఖ రాసారు. ఆయా రాష్ట్రాల‌లో కేసులు, పాజిటివిటీ రేటు, మ‌ర‌ణాలు ఏ ప్రాంతాల‌లో ఏ రీతిలో పెరుగుతున్నాయో గ‌ణాంకాల‌తో వివ‌రించారు. కొవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఆందోళ‌న‌క‌రంగా మారిన నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించారు ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి.


మరింత సమాచారం తెలుసుకోండి: