జ‌వాద్ విశాఖ తీరానికి స‌మీపించ‌డంత బ‌ల‌మైన గాలులు వీయ‌డంతో ఆర్.కే.బీచ్ స‌మీపంలో ఉన్న చిల్ట్ర‌న్ పార్కు ధ్వంసానికి గురైంది. రాత్రి స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఉద‌యం వేళ‌లో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్ట‌యితే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులుండేవి. గ‌తంలో కూడా ర‌క్ష‌ణ గోడ నిర్మించారు. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ.. గోడ‌లు కూలిపోయాయి. పోలీసులు త‌క్ష‌ణ‌మే అప్ర‌మ‌త్తం అయ్యారు.

వేరే ప్రాంతంలో ఆర్‌.కే బీచ్ నుంచి దుర్గాల‌మ్మ గుడి వ‌ర‌కు దాదాపు 200 మీట‌ర్ల వ‌ర‌కు భూమి కోత‌కు గురైంది.  మ‌రోవైపు భూమి కోత‌తో చిల్డ్ర‌న్ పార్కులో ఉన్న బ‌ల్ల‌లు విరిగిపోయాయి. చిల్డ్ర‌న్ పార్కు స‌మీపంలో స‌ముద్రంలో అల‌లు దాదాపు 10 అడుగుల మేర ఎగిసిప‌డ్డాయి.  ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా స‌ముద్రం ముందుకు రావ‌డంతో ఆ ప్రాంతంలోని ప‌లు చోట్ల భూమి కుంగిపోయి ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి.
ఈ త‌రుణంలోనే ఆర్‌.కే.బీచ్ వ‌ద్ద‌కు ప‌ర్యాట‌కుల‌కు అనుమ‌తించ‌కుండా నిషేదించారు. ముఖ్యంగా సంద‌ర్శ‌కులు అక్క‌డికి రాకుండా నోవాటెల్ హోట‌ల్ ముందు  అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసారు


మరింత సమాచారం తెలుసుకోండి: