తెలంగాణ రాష్ట్రంలో వ‌రి ధాన్యం కొనుగోలుపై దాదాపు గ‌త రెండు నెల‌ల కాలం నుంచి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా ఇవాళ తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మ‌రొక‌సారి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్ర‌ప్ర‌భుత్వానికి అప్ప‌గించుతామ‌ని.. ఇది  నిరంత‌రం జ‌రిగే విధాన‌మే.  కేంద్ర‌మంత్రి ఎంత‌ విచిత్రంగా మాట్లాడుతారు అంటే.. మా కోటానే మాకు మొత్తం రాలేదు.. అని మీ బియ్యం మీరు తీసుకెళ్లాల‌ని మాట్లాడుతున్నార‌ని మంత్రి నిరంజ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేసారు. ప‌లుమార్లు లేఖ‌లు రాసార‌ని.. వ‌డ్ల‌ను బియ్యం ప‌ట్టాం.. త‌యారుగా ఉన్నాయ‌ని.. బియ్యాన్ని మీరు తీసుకెళ్లాల‌ని లేఖ‌లు రాసాం అని గుర్తు చేసారు. అయితే మాకు ధ‌ర లేద‌ని.. ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతారు. ముఖ్యంగా తెలంగాణ రైతులు యాసంగిలో వ‌రి వేసి రైతులు మోస‌పోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసారు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి.

వారి ప‌ని వారు చేసుకునేది.. రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం సూప‌ర్‌వైజ్ చేస్తుంద‌ని.. గోదామ్‌ల‌లో నిలువ ఉన్నాయ‌ని వాటిని తీసుకెళ్లాల‌ని చెప్పారు. కేంద్రం ఇవ్వ‌వ‌ల‌సిందే ఇవ్వ‌లేదు అని.. యాసంగి కొన‌మంటే.. ఇప్పుడు కొంటున్నాం అని పేర్కొంటున్నారు. కేంద్ర‌మాత్రం త‌న వైఖ‌రీని మార్చుకోవడం లేద‌ని మంత్రి నిరంజ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని.. బాయిల్డ్ రైస్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ది ఎఫ్‌సీఐ.. ద‌క్షిణాది రాష్ట్రాల‌లో టెంప‌రేచ‌ర్ పెరుగుతుంట‌ది కాబ‌ట్టి... బాయిల్డ్ రైస్ విధానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌దని గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: