తెలంగాణ‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యారోగ్య శాఖ డీహెచ్ శ్రీ‌నివాస‌రావు కూడా హెచ్చ‌రిక జారీ చేసారు. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు ఐదు చోటు చేసుకోవ‌డంతో.. తెలంగాణ‌లో కూడా రేపో మాపో వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఇదిలా ఉండ‌గానే క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఇవాళ క‌రోనా కేసులు దాదాపు 46 చోటు చేసుకున్నాయి. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని బొమ్మ‌క‌ల్‌లో ఉన్న ఓ ప్ర‌యివేటు వైద్య‌ క‌ళాశాల‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించిన‌ది.

ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 46 మంది విద్యార్థుల‌కు క‌రోనా వ‌చ్చిన‌ట్టు నిర్థార‌ణ అయింది. ఉద‌యం నుంచే కోవిడ్ ప‌రీక్ష‌లు చేప‌డుతూనే ఉన్నారు వైద్యులు.  క‌రోనా సోకిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే యాజ‌మాన్యం క‌ళాశాల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన‌ది. వారం రోజుల కింద‌టే క‌ళాశాల‌లో స్నాత‌కోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. అయితే నిన్న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లో 18 మందికి నిర్థార‌ణ కాగా.. ఈరోజు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లో 28 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అయితే కొంత‌మంది విద్యార్థుల‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించక‌పోయినా క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ అయింది. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని విద్యార్థుల‌కు కూడా కోవిడ్ ప‌రీక్ష‌లు చేప‌డుతున్నారు. ప్ర‌స్తుతం కొద్ది రోజుల పాటు ఈ కళాశాల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ఎన్ని రోజుల అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: