ఒమిక్రాన్ వేరియంట్ రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో  వ‌చ్చే  సంవ‌త్స‌రం  జ‌న‌వరి 15 త‌రువాత  ఫిబ్ర‌వ‌రి నెల‌లో థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌న్న వార్త‌లు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఐఐటీ కాన్పూర్ ప్రొపెస‌ర్ కూడా దీని పై అలెర్ట్  చేసారు.  అయితే నిజంగా నే థ‌ర్డ్ వేవ్ వ‌స్తే మ‌ళ్లీ అనేక రంగాల పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే ఈ త‌రుణంలో  ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకబోతున్నట్టు  తెలుస్తున్న‌ది. ఈరోజు నుంచి  ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ ఆధ్వ‌ర్యం లో మాన‌ట‌రీ పాల‌సీ క‌మిటీ  స‌మావేశం  అవ్వ‌నుంది. దాదాపు మూడు రోజుల పాటు ఈ స‌మావేశం కొన‌సాగ‌నున్న‌ది.

మాన‌ట‌రీ పాల‌సీ క‌మిటీ స‌మావేశంలో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌పై కూడా కీల‌క నిర్ణ‌యం  తీసుకోబోతున్న‌ద‌ని కొట‌క్ ఎకాన‌మిక్ రీసెర్చ్ భావిస్తున్న‌ది. ఈ స‌మావేశాలలో రెపో రేట్ల‌ను రివ‌ర్స్ రెపో రేట్ల‌ను నామ‌మాత్రంగా అయిన స‌వ‌రించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. చివ‌రిసారిగా 2020మే నెల‌లో క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న రోజుల్లో ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన‌ది. క‌రోనా థ‌ర్డ్ వేవ్ సంభ‌వించే సూచ‌న‌లున్న సంద‌ర్భంలో ఇప్పుడు కూడా వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆర్థిక వేత్త‌లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: