ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ‌ భార‌త్ కు రానున్నాడు. ప్ర‌తీ ఏడాది  రెండు దేశాల మ‌ధ్య జ‌రిగే వార్షిక స‌ద‌స్సులో భార‌త ప్ర‌ధాని మోడీ తో నేడు పుతిన్ భేటీ కానున్నారు. అదేవిధంగా ఈ స‌మావేశం తో రెండు దేశాల మ‌ధ్య ధ్వైపాక్షిక సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశం ఉన్న‌ద‌ని ఇరు దేశాల నేతలు భావిస్తున్నారు. ఈ భేటీ లో భాగంగా రెండు దేశాల మ‌ధ్య కీల‌కమైన 10 ఒప్పందాల‌పై ఇరు దేశాల నేతలు సంత‌కాలు చేయనున్న‌ట్టు స‌మాచారం.

 ముఖ్యంగా స‌మాచారం, ర‌క్ష‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ మార్పులతో పాటు వాణిజ్యం  వంటి  వాటితో మొత్తం 10 ఒప్పందాల పై ఇరు దేశాల నేత‌లు సంత‌కాలు చేయ‌నున్నారు.  వీరి స‌మావేశానికి ముందు ఇరు దేశాల విదేశాంగ‌, ర‌క్ష‌ణ మంత్రులు స‌మావేశం అవ్వ‌నున్నారు. ఆ త‌రువాత సాయంత్రం 5:30 ల‌కు ఢిల్లీ లో ఉన్న హైద‌రాబాద్ హౌస్ లో మోడీ తో పుతిన్ స‌మావేశమ‌వుతారు. ఈ స‌మావేశం త‌రువాత‌ ఉమ్మ‌డిగా క‌లిసి ప్ర‌క‌ట‌న  చేస్తారు. ఈ ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న కు మీడియా కు అనుమ‌తి లేదని.. కేవ‌లం ఒక కెమెరా మెన్ కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుందని స‌మాచారం.  తిరిగి ఇవాళ‌ రాత్రి  9:30 గంట‌ల‌కు పుతిన్ తిరిగి ర‌ష్యాకు ప‌య‌న‌మ‌వుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: