తెలంగాణ రాష్ట్రంలో నూత‌న జోన‌ల్ వారిగా ఉద్యోగుల విభ‌జ‌న కోసం ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను చేసిన‌ది. అయితే ఎన్నిక‌ల  నియమావళి లేని జిల్లాలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొన‌సాగించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  రాష్ట్రంలో స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాల‌లో ఉద్యోగుల విభ‌జ‌న ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత చేప‌ట్ట‌నున్నారు.

అయితే ఎన్నిక‌ల నియామావ‌ళి లేని జిల్లాల‌లో మాత్రం ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ కొన‌సాగించ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీల‌కు రోస్ట‌ర్ విధానంలో పోస్టులు ద‌క్క‌నున్నాయి. ఉద్యోగ సీనియారిటీ కూడా న‌ష్ట‌పోకుండా ఉద్యోగుల‌ను స‌ర్దుబాటు చేయ‌నున్నారు ఉన్న‌తాధికారులు. ఏ జిల్లాకు సంబంధించిన ఉద్యోగుల‌ను ఆ జిల్లాకే కేటాయించ‌నున్నారు. ముఖ్యంగా భార్య‌, భ‌ర్త‌లు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్ట‌యితే వారికి తొలి ప్రాధాన్యాత ఇవ్వ‌నున్నారు. జిల్లా క్యాడ‌ర్ పోస్టుల కోసం పాత జిల్లా క‌లెక్ట‌ర్ చైర్మ‌న్ గా సంబంధిత శాఖ అధిప‌తి స‌భ్యునిగా క‌మిటీ ఉండ‌నుంది.



 


మరింత సమాచారం తెలుసుకోండి: