నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఆర్మి కాల్పుల ఘ‌ట‌న‌పై ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొలిపేందుకు కృషి చేస్తాం. నాగాలాండ్‌లో ఆర్మీ కాల్పుల‌పై లోక్‌స‌భ‌లో అమిత్ షా వివ‌ర‌ణ ఇచ్చారు. సిట్ ఏర్పాటు చేసి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించారు కేంద్ర హోంశాఖ మంత్రి. కాల్పుల‌పై దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసారు అమిత్ షా. ఉగ్ర‌వాదుల‌ని అనుమానంతోనే కాల్పులు జ‌రిపారు. ప్ర‌స్తుతం నాగాల‌ఆండ్‌లో ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు అమిత్ షా.

నాగాలాండ్‌‌లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పులలో మృతుల సంఖ్య 14కు చేరుకున్న‌ది.  మినీ ట్రక్‌లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా  భావించి పొర‌పాటున కాల్పులు జరిపారు జవాన్లు. ఈ కాల్పుల్లో 12 మంది అక్కడిక్కకడే మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరు పౌరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఈఘ‌ట‌న త‌రువాత ప్ర‌జ‌లు ఆగ్ర‌హానికి గురై   ఓ జవాన్‌పై దాడి చేయడంతో అతడు కూడా ప్రాణాలు  కోల్పోయారు.  ఆర్మీ కాల్పుల ఘ‌ట‌న‌పై నాగాలాంట్ ప్ర‌భుత్వం ప్రత్యేకంగా ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: