ఇటీవ‌ల టీడీపీ నేత ప‌ట్టాభిరామ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి పై విమ‌ర్శ‌లు చేసి.. సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విధిత‌మే.  ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ, టీడీపీ మ‌ధ్య ర‌గ‌డ‌.. ప‌ట్టాభి  జైలు.. టీడీపీ కార్యాల‌యాలపై దాడులు,  ఆసుప‌త్రి ఇలా రెండు, మూడు రోజుల పాటు ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌ రాజ‌కీయ ర‌గడ‌నే కొన‌సాగిన‌ది. తాజాగా మ‌రొక‌సారి టీడీపీ నేత పట్టాభిరామ్‌ సీఎం జగన్‌ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేసారు.

 ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేసిన విషయం విధిత‌మే.  దీనిపై  పట్టాభి స్పందిస్తూ..  లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరొక‌ మోసం అని  పేర్కొన్నారు. పేదల  ఇండ్ల  కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పుడు లే అవుట్ల నుంచి అద‌నంగా 1000 ఎక‌రాలు ఎందుకు అని ప్ర‌శ్నించారు ప‌ట్టాభి. ఇదివ‌ర‌కు సేక‌రించిన భూమినే పేద ప్ర‌జ‌లకు పంచ‌లేద‌ని.. కొత్త‌గా గెజిట్ నోటిఫికేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని మండిప‌డ్డారు ప‌ట్టాభి. ప్రతీ ఏటా రూ.2500 కోట్లు కొట్టేయ‌డానికే జ‌గ‌న్ అండ్ కో సిద్ధ‌మ‌య్యారు అని ప‌ట్టాభిరామ్‌ ధ్వ‌జ‌మెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: