తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌పై ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తెలంగాణ సీఎంస్‌, మున్సిప‌ల్ శాఖ సెక్రెట‌రీపై ఈసీ సీరియ‌స్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌గానే..స్థానిక సంస్థ‌ల నేతల‌ జీతాలు  పెంచ‌డంపై హై కోర్టు ఆగ్ర‌హ‌మైంది. వెంటనే రెండు రోజుల్లోనే జీవోను వెన‌క్కి తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గ‌త‌నెల 18న‌ ఉత్తర్వులు ఇచ్చింది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్న నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న  స‌మ‌యంలో ఈ ఉత్తర్వులు ఇవ్వడంపై  అధికారుల‌పై ఈసీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ది.

మున్సిపల్ కార్పొరేషన్‌ల‌కు సంబంధించి మేయర్జీతం రూ.50 వేల నుంచి రూ.65 వేలు..  డిప్యూటీ మేయర్కు రూ.25 వేల నుంచి రూ.32,500, వార్డు మెంబర్లకు రూ.6 వేల నుంచి రూ.7,800లకు పెరగనున్న‌ది.  అదేవిధంగా 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్కు రూ.15 వేల నుంచి రూ.19,500లకు, వైస్ చైర్ పర్సన్ కు రూ.7,500 నుంచి రూ.9,750, వార్డు మెంబర్లకు రూ.3,500 నుంచి రూ.4,550కి  పెంచిన‌ట్టు జీవో విడుద‌ల చేసింది.  50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్కు రూ.12 వేల నుంచి రూ.15,600, వైస్ చైర్ పర్సన్కు రూ.5 వేల నుంచి రూ.6,500, వార్డు మెంబర్కు రూ.2,500 నుంచి రూ.3,250కు పెరిగిన‌ట్టు న‌వంబ‌ర్ 18, 2021న జీవో విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం. జీవో విడుద‌ల చేసిన‌ప్పుడే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అభ్యంత‌రం తెలిపి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ విచార‌ణ జ‌రిపిన కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: