కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం గ‌డిచిన మూడు సంవ‌త్సరాల కాల వ్య‌వ‌ధిలో  ప్ర‌క‌ట‌నల కోసం ఖ‌ర్చు చేసిన మొత్తం రూ. 1,698.98 కోట్లు ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే స్వ‌యంగా పేర్కొంది.  ఈ విష‌యాన్ని పార్ల‌మెంట్ లో స్వ‌యంగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్  ప్ర‌క‌టించారు. ఇవాళ లోక్ స‌భ లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అధ్య‌క్షుడు ఎంపీ మౌల‌నా బ‌ద్రుద్దీన్ అజ్మ‌ల్ అడిగిన ప్ర‌శ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వ‌కం గా స‌మాధానం ఇచ్చారు.

2018-19 నుంచి 2020-21 మధ్య న్యూస్‌ పేపర్లకు, న్యూస్‌ ఛానల్స్‌కు ప్రకటనల కోసం రూ. 1,698.98 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన‌దని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స‌మాధానంగా లిఖిత‌పూర్వ‌కంగా పేర్కొన్నారు.  అయితే మోడీ  ప్ర‌భుత్వం ప్ర‌జ స‌మ‌స్యల కంటే.. వారి చేప‌ట్టే ప‌లు కార్య‌క్ర‌మాలు ప్ర‌చారం కోస‌మే అధికంగా ఖ‌ర్చు చేస్తున్న‌ద‌ని ప్ర‌తి ప‌క్షాలు ఆరోపణ‌లు చేస్తున్నాయి.  వ్య‌క్తి గ‌త ప్రచారం కోసం న‌రేంద్ర మోడీ వేల కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌తి ప‌క్షాలు మండిపడుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర‌మంత్రి ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇంకా ఎక్కువ‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: