ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంతో అత్యవసరంగా సమావేశమయ్యారు.  ఈ బుధవారం తమిళనాడులో నీలగిరి కనుమల్లో కూనూర్ వద్ద రక్షణ శాఖ హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో సైనికాధ్యక్షుడు బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు చనిపోయారు.  మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ ఘటన పై దేశం యావత్తు నివ్వెర పోయింది. వెంటనే  కేంద్ర ప్రభుత్వంతో పాటు తమిళనాడు ప్రభుత్వం అధికారులు, మిలటరీ సిబ్బంది అందరూ కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చెరుకున్నారు. ఇప్పటి వరకూ లభ్యమైన మృత దేహాలు ఎవరివనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.  కేంద్ర మంత్రి మండలి అత్యవసర భేటీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,  హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ప్రధాన మంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఈ సమావేశం అనంతరం రక్షణ శాఖ మంత్రి   సైనికాధ్యక్షుడి బిపిన్ రావత్  పై ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా  లభ్యమైన మాంసపు ముద్దల్లో ఒకటి రావత్ దని సైనిక సిబ్బంది భావిస్తున్నారు.  ఆచూకీ తెలియకుండా పోయిన వారి గురించి గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో గాలింపు చర్యలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: