ఈరోజు దేశానికి చాలా విచార‌క‌రమైన రోజు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మృతి చెందార‌నే వార్త తెలియ‌గానే చాలా బాధ‌గా అనిపించింద‌ని చెప్పారు. బిపిన్ రావ‌త్‌తో పాటు భార్య మ‌ధులిక కూడా మృతి చెంద‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. అదేవిధంగా 11 మంది ఆర్మీ సిబ్బంది ఈ ప్ర‌మాదంలో మృతి చెంద‌డం విచార‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. మాతృభూమికి అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో సేవ‌లందించిన వీర సైనికుడు బిపిన్ రావ‌త్ అని అమిత్ షా కొనియాడారు.

బిపిన్ రావ‌త్ మృతి ప‌ట్ల భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌కోవింద్‌,  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు సంతాపం ప్ర‌క‌టించారు. ముఖ్యంగా బిపిన్ రావ‌త్ 1978లో ఆర్మీలో చేరి.. ప‌లు ప‌ద‌వులను అధిరోహించి.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జ‌న‌ర‌ల్ ప‌ద‌వీని ద‌క్కించుకున్నారు. ఎన్నో అవార్డుల‌ను అందుకుని ప‌దిలమైన రికార్డును సృష్టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: