త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కూనూరులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు 11 మంది ఆర్మీఅధికారులు,  సిబ్బంది మ‌ర‌ణించారు. అయితే భార‌త ప్ర‌ధాని మోడీ బిపిన్ రావ‌త్ మృతి ప‌ట్ల‌ సంతాపం ప్ర‌క‌టించారు. దేశానికి అంకిత భావంతో సేవ‌లందించారు అని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పేర్కొన్నారు.

బిపిన్ రావ‌త్ సేవ‌ల‌ను ప్ర‌ధాని కొనియాడారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయ‌న చివ‌ర‌కు సీడీఎస్ ప‌ద‌వీని పొంది ప‌ద‌వీలో ఉండ‌గానే మృత్యువాత‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. బిపిన్ రావ‌త్ తో పాటు 11 మంది ఆర్మీ మృతి చెంద‌డం  భార‌తదేశానికి, ఆర్మీకి తీర‌ని లోటు అన్నారు ప్ర‌ధాని మోడీ. అదేవిధంగా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.  బిపిన్ రావత్ దేశ ర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించాడ‌ని మోడీ కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: