తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. నిన్న కేటీఆర్‌ ఓ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి వంటి వారి ఛాలెంజ్‌లకు తాను స్పందించను అన్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఛాలెంజ్ చేసి, చర్చల నుండి తప్పించుకునే బదులు...కనీసం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేటీఆర్ ను కోరుతున్నానన్నారు.


టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు టీఆర్ఎస్ పాత హామీలు గుర్తు చేశారు. ఏప్రిల్ 13, 2017న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ హామీ ఇచ్చి 4 సంవత్సరాలు అయిపోయిందని.. ఈ హామీని పూర్తిగా విస్మరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త తీసుకోవాలని.. విపక్షాల సవాళ్లను తప్పించుకోవడం విజ్ఞత కాదని రేవంత్ రెడ్డి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: