తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క‌రోనా  మ‌హ‌మ్మారి హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది. క్ర‌మ క్ర‌మంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖల‌ను క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. తాజాగా  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది .స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న పోచారం తాజాగా నిర్వహించిన ఈ పరీక్షలో పాజిటివ్ సంభవించింది.

 అయితే ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి లో ఉన్నటువంటి  ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి.  ఈ సమయంలో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు అందరూ పరీక్షలు చేయించుకొని ఈ జాగ్రత్తలతో ఉండాలని సూచించారు. మరోవైపు క‌రోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా స్పీకర్ పోచారం క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఆయనకు కొవిడ్‌-19 సంభవించింది. మ‌రోవైపు క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ‌లో పాఠ‌శాల‌ల‌కు ఈనెల 30 వ‌ర‌కు సెల‌వుల‌ను పొడిగించింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: