బ్రిట‌న్‌లో క‌రోనా కేసులు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గు ప‌డుతున్న త‌రుణంలో  బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఓ  కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక వ‌చ్చే వారం నుంచి క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉదృతి త‌గ్గుతున్న త‌రుణంలో మాస్క్‌ను త‌ప్ప‌ని స‌రి నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌బోతున్న‌ట్టు ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ దిగువ  స‌భ‌లో పేర్కొన్నారు. వ‌చ్చే వారం నుంచి మిన‌హాయింపులు ఇవ్వ‌బోతున్న వెల్ల‌డించారు. బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ కేసులు పీక్స్ ద‌శ‌ను దాటింద‌ని.. ఆఫీస్ ఆఫ్ నేష‌న‌ల్ స్టాటిస్టిక్స్ కూడా తెలియ‌జేసింది.

వ‌చ్చే గురువారం నుంచి అన‌గా జ‌న‌వ‌రి 27 నుంచి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లు, మాస్క్‌లు ధ‌రించ‌డం, స‌భ‌లు స‌మావేశాల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ ధృవ‌ప‌త్రం త‌ప్ప‌నికాదు అని బ్రిట‌న్‌ ప్ర‌ధాని పేర్కొన్నారు. త‌మ‌కు బ్రిట‌న్ పౌరుల‌పై పూర్తిగా న‌మ్మ‌కముంద‌ని.. ర‌ద్దీగా ఉండే ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు మాస్క్ ధ‌రిస్తారు అని పేర్కొన్నారు. అయితే మాస్క్ మాత్రం త‌ప్ప‌నిస‌రి కాదు అని బోరిస్ జాన్స‌న్ వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 08 నుంచి ఆంక్ష‌ల‌ను కఠినంగా అమ‌లు చేస్తూ వ‌చ్చామ‌ని.. రోజుకు 2ల‌క్ష‌ల పైగా కేసులు న‌మోదు కావ‌డంతో  అప్ప‌డు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు. ఇప్పుడు కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఆంక్ష‌ల‌ను ఎత్తి వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వెల్ల‌డించినది బ్రిట‌న్ ప్ర‌భుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: