ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో, ఉత్త‌ర‌ఖండ్‌, గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ ఈ ఐదు రాష్ట్రాల‌కు ఫిబ్ర‌వ‌రి 10 నుండి ఎన్నిక‌లు నిర్వ‌హించే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ఆప్ పోటీకి సిద్ధ‌మైన‌ది. ఏ విధంగా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఆప్ అభ్య‌ర్థులు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేప‌డుతూ ఉన్నారు. ఆప్ చీఫ్ మాత్రం వినూత‌నంగా ప్ర‌చారం నిర్వ‌హించ‌డం ప్రారంభించారు.


ఢిల్లీ ప్ర‌భుత్వం ఎన్నో విజ‌య‌వంతంమైన ప‌థ‌కాల‌ను రూపొందించిన‌ద‌ని.. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ లభించింది. ఢిల్లీ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తూ ఉన్న ప‌థ‌కాల‌కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాల‌ని.. ఎవ‌రి వీడియోలు వైర‌ల్ అవుతాయో వారిలోని 50 మందిని సెల‌క్ట్ చేసి వారితో క‌లిసి డిన్న‌ర్ చేస్తాన‌ని కేజ్రీవాల్ తెలిపారు. దీంతో ఆప్ కార్య‌క‌ర్త‌లు వినూత్న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లుందుకు విరివిగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చూడాలి మ‌రీ వీరి ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో ఎన్నికల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: