గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కు పద్మభూషణ్ ప్రకటించడం ఇప్పుడు కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. దీనిపై కాంగ్రెస్ నేతలు భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలుగా పేరున్న జీ 23 గ్రూపు నేతలు ఈ అంశంపై తమ హైకమాండ్‌కు చురకలు వేస్తున్నారు.


గులాం నబీ అజాద్ సేవలను దేశం గుర్తించినా.. కాంగ్రెస్ మాత్రం గుర్తించలేదన్నారు. కాంగ్రెస్‌కు  ఆయన సేవలు అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్  సెటైర్‌ వేశారు. పద్మభూషణ్‌ దక్కించుకున్న ఆజాద్ కు కపిల్‌ సిబల్ శుభాకాంక్షలు తెలిపారు. కపిల్ సిబల్‌తోపాటు శశిథరూర్ కూడా అజాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతకు అవతలి పక్షం గుర్తింపు ఇవ్వడం కూడా ఓ మంచి సంప్రదాయమేనని శశి థరూర్‌ అన్నారు. మొత్తానికి మోదీ.. ఒక్క అవార్డుతో కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: