సముద్రపు అలలపై తేలిపోతుంటే ఎంత బావుంటుంది. కానీ అలా తేలిపోవాలంటే.. మంచి జలక్రీడాకారులై ఉండాలి.. మరి సామాన్యుడి సంగతి ఏంటి.. ఇలాంటి వారికోసమే ఇప్పుడు కొత్త వంతెనలు వస్తున్నాయి. ఈ వంతెనలు సముద్రంపై కడుతున్నారు. సముద్రపు జలాలపై నిర్మించే ఈ వంతెనలు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు  అన్ని బీచుల్లో ఇలాంటి వంతెనల నిర్మాణానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

తాజాగా సముద్రంలో తేలియాడే బ్రిడ్జిని కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రారంభించింది. ఉడుపిలోని మాల్పే బీచ్ లో కర్ణాటకలోనే మెుట్టమెుదటి తేలియాడే బ్రిడ్జిని ప్రారంభించారు. బ్రిడ్జి వద్ద టూరిస్టుల రక్షణ కోసం 20 నుంచి 25 మంది సహాయకులను నియమించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ లు వేసుకుని రావాలి. మెుత్తం వందమీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జి పై నడుస్తూ సముద్రపు అందాలను వీక్షించవచ్చు. ప్రస్తుతం 15 రోజులపాటు ఈ తేలియాడే బ్రిడ్జిని ట్రయల్స్ కోసం అందుబాటులో ఉంచారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: