బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈసారి హైదరాబాద్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల కోసం ఏర్పాటు చేసిన వివిధ ప్రాంగణాలకు బీజేపీ పేర్లు పెట్టింది. హెచ్‌ఐసీసీ, నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా బీజేపీ నామకరణం చేసింది. అలాగే జాతీయ కార్యవర్గ సమావేశస్థలికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేసింది. ఈ సమావేశాల భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా నామకరణం చేశారు. అలాగే మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్ హాల్‌గా నామకరణం చేశారు. అతిథులు బసచేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా నామకరణం చేసారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశమందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు పెట్టారు.


జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు  పేరు పెట్టారు. భాజపా సంఘటన కార్యదర్శుల సమావేశమందిరానికి కుమురంభీం పేరు పెట్టారు. ఎగ్జిబిషన్‌కు గొల్కొండగా బీజేపీ పేరు పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాల ప్రాంగణానికి నారాయణ పవార్ పేరు, సికింద్రాబాద్ పరేడ్ సభకు విజయసంకల్ప సభగా నామకరణం చేశారు. మొత్తానికి తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యం ఉన్న వ్యక్తుల పేర్లు పెట్టడం ద్వారా బీజేపీ తెలంగాణ స్ఫూర్తిని రగిలించిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp