కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారా.. అంటే అవునని ఆరోపిస్తున్నారు కొందరు టీడీపీ నేతలు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాదు రెడ్డి టీడీపీలోకి చేరేందుకు విశ్వ ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట. ఈ మాటలు అంటున్నది టీడీపీ నాయ‌కుడు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి..

టీడీపీ ప్రముఖ నాయ‌కుల వ‌ద్దకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి  త‌న అన్నను పంపి మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  వైసీపీలో రాచ‌మ‌ల్లుకు ఎమ్మెల్యే టికెట్ రాద‌ని అనుమానంగా ఉందట. అందుకే ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట. అయితే టీడీపీలోకి రానిచ్చేందుకు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లుకు ప్రవేశం లేదట. అందుకే ఆ అక్కసుతోనే రాచమల్లు చంద్రబాబు పై విమ‌ర్శలు చేస్తున్నార‌ట. ఎమ్మెల్యే వ‌ర్గీయులు ఆయ‌నకు దూరం అవుతున్నార‌న్న కోపంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని ప్రవీణ్‌ కుమార్ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: