వర్షాకాలం వచ్చిందంటే రోగాలు విజృంభిస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అనేక జబ్బులు వస్తాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, గొంతునొప్పి, ప్లూజ్వరం, డయేరియా, మలేరియా, కలరా, టైఫాయిడ్, కామెర్లు, డెంగ్యూ, చికెన్‌ గున్యా.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


అవేంటంటే.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు.. అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పని సరి అయి బయటకు వెళ్తే తప్పకుండా గొడుగు, రెయిన్ కోట్  వంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.  త్రాగునీరు కాచి, చల్లార్చి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. అపరిశుభ్రమైన ఆహారం తినడం మానేయాలి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. కరోనా తగ్గిందని మాస్కు మానేయొద్దు. మాస్కు ధరిస్తే కోవిడ్‌తో పాటు సీజనల్ జబ్బుల నుంచీ రక్షణ పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: