ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చింది. కరోనా గురించి అశ్రద్ధ వద్దని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 వారాలుగా కొత్త కొవిడ్ కేసులు పెరుగుతున్నాయట. ఈ మేరకు  ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ఓ ప్రకటనలో  తెలిపింది. అయితే..  మరణాల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO  వెల్లడించింది. గతవారం 6 శాతం పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా 57 లక్షల కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO తెలిపింది.


గతవారం  9వేల 800మంది వైరస్‌ బారినపడి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. అంతకుముందు వారం దాదాపు అంతే మరణాలు నమోదైనట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO  పేర్కొంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ అత్యవసర స్థితిలోనే ఉందని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ తెలిపారు. తాజా కేసుల పెరుగుదల పట్ల ట్రెడోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నిర్వహణను పలు దేశాలు సమర్థవంతంగా నిర్వహించడం లేదని ట్రెడోస్‌ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: