హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ రంగం జోరుగా ఉంది. అయితే.. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌  లావాదేవీల్లో హెచ్‌ఎండీఏ పరిధి అగ్రస్థానంలో ఉందని తేలింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడిలో మూడో వంతు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే వస్తుందని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి రంగంలో 80 శాతం హైదరాబాద్‌ చుట్టుపక్కలే ఉందన్నమాట.

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్  లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆస్తుల విలువతో పాటు లావాదేవీల సంఖ్య కూడా హెచ్‌ఎండీఏ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే 80 శాతం ఉన్నాయట. ఇక మిగిలిన ప్రాంతాల నుంచి మిగిలిన 20 శాతం ఆదాయం వచ్చిందట. అంతే కాదు.. ఇక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆరేళ్లలో దాదాపు 150 శాతం వరకు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: