కరోనా పరీక్ష చేయించుకోవాలంటే.. అదో చిన్నపాటి నరకం.. స్వాబ్ తీసేందుకు ముక్కులోకి పుల్లను పంపుతారు. ఇది చాలా మందికి ఇబ్బందిగా ఉంటున్నా వేరే మార్గం లేదు. కానీ ఇప్పుడు కేవలం ఇంటిలోనే కూర్చుని లాలాజలాన్ని పరీక్షించుకోవడం ద్వారా కరోనా పరీక్ష చేయించుకోవచ్చట. ఉమ్మితో కేవలం 45 నిమిషాల్లోనే గుర్తించే పద్ధతిని అమెరికా సైంటిస్టులు కొత్తగా కనిపెట్టారు.


అంతే కాదు.. ఈ పరీక్ష ఫలితాలు పీసీఆర్‌ పరీక్షకు దీటుగా ఉంటాయని చెబుతున్నారు. కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను కచ్చితంగా కనిపెట్టేందుకు పీసీఆర్‌ పరీక్షే ప్రామాణికంగా చూస్తున్నారు.  కానీ దాని ఫలితం రావడానికి కనీసం ఒక్క రోజైనా ఆగాలి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షను సులభంగా చేస్తున్నా ఫలితం పీసీఆర్‌ అంత కచ్చితం కాదు. అందుకే ఇప్పుడు ఉమ్మి పరీక్ష సౌలభ్యం, కచ్చితత్వం రెండింటినీ ఇస్తుంది. వందల కొద్దీ నమూనాలను పరీక్షించి లాలాజల పరీక్ష సామర్థ్యాన్ని నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: