మోదీ సర్కారు జనంపై మరోసారి కొత్త బాంబు పేల్చబోతోంది. ఇప్పటికే నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్‌ రేట్లు మోత మోగిస్తున్నారు. జీఎస్టీ మార్పులతో రేట్లు పెంచేశారు. విద్యుత్‌ చట్టాన్ని సవరించేందుకు బిల్లు తయారు చేసి ఇటీవల మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీన్ని ప్రతిపక్షాలు, విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. దీంతో  సభాపతి ఈ బిల్లను సెలెక్ట్‌ కమిటీకి పంపారు.


అయితే.. ఈ బిల్లు ఇక ఇప్పట్లో బయటికి వస్తుందో రాదోనన్న అనుమానం ఉంది. దీంతో మోదీ సర్కారు కొత్త ప్రయత్నం ప్రారంభించింది. దొడ్డిదారిన మోదీ సర్కారు కరంట్ రేట్లు పెంచే ఆలోచన చేస్తోంది. విద్యుత్‌ చట్టం-2003లోని నియమావళికి సవరణలు చేస్తోంది. కేంద్ర విద్యుత్‌శాఖ దొడ్డిదారిన తాజా ముసాయిదాను పంపించింది. ఈ సవరణలపై అభ్యంతరాలకు సెప్టెంబరు 11 దాకా గడువు ఇచ్చింది. అక్టోబరులో తుది ఉత్తర్వులు జారీఅయ్యే అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: