ఏపీలో క్యాన్సర్ రోగులకు వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని సీఎం జగన్ ఆదేశించారు. మెడికల్‌ కాలేజీలు, కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల్లోప్రత్యేక క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఉన్న కేన్సర్ విభాగాలను బలోపేతం చేసి సదుపాయాలు కల్పించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లోకి 12 రకాల రాపిడ్‌ డయాగ్నోస్టిక్స్‌ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైఎస్ జగన్ ఆదేశించారు. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు.


క్యాన్సర్‌ నివారణ, చికిత్సలపై సమీక్షించిన సీఎం జగన్.. వీటి నివారణపై  ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏపీలో ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీల్లోప్రత్యేక క్యాన్సర్‌ విభాగాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇది కేన్సర్‌ కేర్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌కు సెంటర్‌ కావాలని సీఎం జగన్  అన్నారు. ఇదివరకు ఉన్న కేన్సర్‌ విభాగాలను బలోపేతం చేయడం, లేనివాటిలో సదుపాయాల కల్పన జరగాలని సీఎం జగన్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: