ట్వంటీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లలో రాహుల్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తానంటున్నాడు భారత జట్టు సారథి రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభమించడమనేది మంచి ప్రత్యామ్నాయమేనన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్ జోడీపై ప్రయోగాలు చేయబోమని తేల్చిచెప్పాడు. కేఎల్‌ రాహుల్ భారత జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడని రోహిత్ పేర్కొన్నాడు.

జట్టులోని అటగాళ్లందరి పాత్రపై మేనేజ్ మెంట్  స్పష్టమైన అభిప్రాయంతో ఉందని వివరించాడు. ఆసియా కప్ లో కేఎల్‌  రాహుల్  పేలవ ప్రదర్శన, స్ట్రైక్  రేట్ ను కొందరు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుంటే కేఎల్‌  మ్యాచ్  విన్నర్  అని రోహిత్  తెలిపాడు. ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో భారత్  జట్టు..ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల సిరీస్  ఆడనుంది. తర్వాత దక్షిణాఫ్రికాతోనూ మరో మూడు మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొన్న తర్వాత.. ప్రపంచకప్  కోసం ఆస్ట్రేలియా వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: