రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్‌ వర్శిటీగా పేరు మార్చడంపై దుమారం కొనసాగుతోంది. అయితే.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మార్చటానికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చిందని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడని కొనియాడిన బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్చిన జగన్.. గుంటూరులోని జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చటం లేదని ప్రశ్నించారు.

జిన్నా టవర్ పేరు మార్చకుండా జాతీయ జెండా రంగులు వేయటం ఏమిటన్న బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. సినిమాల్లోని పాత్రలతో దేశభక్తునిగా ఎన్టీఆర్ నిలిచిపోయారని... తన హింసావాదంతో జిన్నా చరిత్రహీనుడిగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం దేశ భక్తులకు అనుకూలమా, దేశ ద్రోహులకి అనుకూలమా తేల్చుకోవాలని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ వైఎస్ పేరు, జగన్ పేర్లే పెట్టడం సరికాదని... స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: