భారత్‌, చైనా సరిహద్దుల్లో భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. చైనాకు చుక్కలు చూపించేలా సరిహద్దులకు వంద కిలోమీటర్ల దూరంలో భారత్‌, అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాల 18వ ఎడిషన్‌ యుద్ధ అభ్యాస్‌ 2022ను ఉత్తరాఖండ్‌లోని ఔలీలో నిర్వహిస్తున్నారు. ఈ భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు రెండు వారాలు కొనసాగుతాయి.

గతేడాది ఈ విన్యాసాలను అమెరికాలోని అలాస్కాలో ఉన్న జాయింట్‌బేస్‌ ఎల్మాండర్‌ రిచర్డ్స్సన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాల్లో శిక్షణ పొందిన కుక్కలతో ఉగ్రవాదులను ఎదుర్కొనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. శత్రువుల డ్రోన్లను కూల్చడానికి  గాలిపటాలను ఉపయోగించే తీరును ప్రదర్శిస్తున్నారు. అలాగే  కిల్‌ హౌస్‌ విన్యాసాలతో పాటు రష్యా తయారు చేసిన MI-17V5 హెలికాప్టర్‌ తోనూ విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఇండియా, అమెరికా రకరకాల వ్యూహాలు, టెక్నాలజీలను ఇరు దేశాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: