తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇవాళ విడుదల కానుంది. గవర్నర్ అనుమతితో కొత్త శాసనసభ ఏర్పాటు కోసం సభ్యులను ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఇవాళ్టి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది.


నామినేషన్ల దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయం వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ తో పాటు విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తప్పనిసరి. నామినేషన్ దాఖలుకు కనీసం ఒక రోజు ముందు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: