కాకినాడ జిల్లా కు చెందిన బాధిత మహిళా ఆరుద్ర.. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిశారు. దివ్యంగురాలైన ఆమె కుమార్తె కు 10 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమె కుమార్తె వైద్యానికి 5 లక్షల రూపాయల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక, కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు పడ్డామని ఆరుద్ర తెలిపారు.

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ తో పాటు వైసిపి నేతల దాడి లో గాయపడిన బాధిత మహిళ ఆరుద్ర, ఆమె కుమార్తె.. గతంలో పలుసార్లు ఏపీ సీఎంఓకు వచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే.. అప్పట్లో సీఎం జగన్‌ కు అధికారులకు ఆదేశాలు ఇచ్చినా.. అవి అమలు కాలేదని ఆరుద్ర చెబుతున్నారు. ఆరుద్ర ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: