స్పీకర్‌కు అభినందన తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై సెటైర్లు వేశారు. 2019ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ ఏవేవో లెక్కలు చెప్పాడని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో కూటమి కి వచ్చింది 164 అంటే..  1+6+4 =11 వైకాపా కి వచ్చిన సీట్లు అంటూ సెటైర్లు వేశారు. అలాగే అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు.. అందుకే  1+6+3+1 = 11 అంటూ సెటైర్లు వేశారు.


పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారని.. 21స్థానాల్లో పోటీ చేస్తే 21స్థానాల్లో నూ పవన్ కళ్యాణ్, ఆయన అభ్యర్థులు గెలిచి చూపించారని.. చంద్రబాబు అన్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్.. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలన్నారు. రాష్ట్రాన్ని నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేదుకు అంతా కలసి కట్టుగా కృషి చేద్దామని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: