ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తొలి కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఎన్డీఏ సర్కారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది తొలి కేబినెట్ సమావేశం. ఇవాళ ఉదయం10గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు సీఎం కాగానే చేసిన 5 సంతకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, పింఛన్‌ రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలపనుంది.


దీంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్య అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దీనిపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రి హోదాలో పవన్ కల్యాణ్‌ పాల్గొంటున్న తొలి కేబినెట్ మీటింగ్‌ కూడా ఇదే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: