ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్.. కానీ.. ఎన్డీఏ అంటే నేషనల్ డిజాస్టర్  అలయెన్స్.. అంటున్నారు మంత్రి కేటీఆర్.. విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేలా వరుస సంఘటనలు దురదృష్టకరమన్న మంత్రి కేటీఆర్.. జూన్ నాలుగో తేదీన నీట్ - యూజీ పేపర్ లీక్.. జూన్ 19న యూజీసీ - నెట్ పరీక్ష రద్దు.. జూన్ 21న సీఎస్ఐఆర్ - యూజీసీ - నెట్ పరీక్ష వాయిదా.. జూన్ 22 న చివరి నిమిషంలో నీట్ - పీజీ పరీక్ష వాయిదా.. ఇలా బీజేపీ  నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయాలకు ఎలాంటి పొంతన లేకుడా పోయిందని విమర్శించారు.


నీట్ - యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనా మోదీ ప్రభుత్వం జూలై ఆరో తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి నిర్ధిష్ట కారణాలు చూపకుండా నీట్ - పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారన్న మంత్రి కేటీఆర్.. ఈ నిర్ణయాల వెనక ఉన్న లాజిక్ ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్టర్ అలయన్స్ కారణమని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: