రూ.10 కాయిన్‌పై ప్రజలలో ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. చాలా మంది ఈ కాయిన్లను తీసుకోవడం లేదు కూడా. ఎవరైనా రూ.10 కాయిన్ ఇస్తుంటే చాలు, వద్దనే మోహం మీదనే చెప్పేస్తున్నారు. అయితే రూ.10 కాయిన్ చెల్లుబాటుపై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.దేశంలో రూ.10 కాయిన్లు చెల్లుబాటులో ఉన్నాయని, వీటిని ఆర్‌బీఐ ముద్రించి సర్క్యూలేషన్‌లో ఉంచిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ రూ.10 కాయిన్లను వివిధ సైజులు, డిజైన్లలో ముద్రిస్తోందని చెప్పారు. అవన్నీ చెల్లుబాటు అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. అన్ని రకాల లావాదేవీలకు ఈ కాయిన్లను వాడుకోవచ్చని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణ యజమానులు, వ్యాపారులు 10, 20 రూపాయల నాణేలను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇకపై అలా చేయడానికి వీల్లేదు.చాలా చోట్ల అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాలు, నగరాల్లో కూడా దుకాణాలు, వాణిజ్య సంస్థలు ప్రజల దగ్గర నుంచి రూ.10, రూ.20 నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. వినియోగదారులకు నేరుగా తీసుకోమని చెప్పడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.భారత ప్రభుత్వం ఆమోదించిన రూ.10, రూ. 20 రూపాయల నాణేలు చెల్లవని ప్రజల్లో విస్తృతమైన అభిప్రాయం ఉంది. ప్రజల్లో నెలకొన్న అపోహలను నమ్మవద్దని ..ఇదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపారు.భారత ప్రభుత్వంచే ఆమోదించబడిన 10, 20 రూపాయల కాయిన్స్ వాటిని చెల్లుబాటు చేయకపోవడం లేదా స్వీకరించడానికి నిరాకరించడం లేదా డబ్బుకు బదులుగా వాటిని ఇవ్వడం చట్టం ప్రకారం నేరం. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124A ప్రకారం, భారత ప్రభుత్వం ఆమోదించిన నాణేలను కొనుగోలు చేయడానికి నిరాకరించడం నేరం.ఈ నేరానికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. భారత ప్రభుత్వం ఆమోదించిన కరెన్సీని ధిక్కరించి రూ.10, రూ.20 నాణేలను తీసుకోకపోతే ఏ వ్యక్తి లేదా దుకాణంపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు.పది రూపాయల నాణేలు చెల్లావన్నది అపోహేనని ఆర్.బి.ఐ స్పష్టం చేసింది. ఏ డిజైన్ ఏ ఆకృతిలో ఉన్న నాణ్యమైన చెల్లుతుందని వాటిని తీసుకునేందుకు  ఎవరు నిరాకరించవద్దని తెలిపింది. నిరాకరిస్తే చట్ట ప్రకారం శిక్ష అర్హులేనని హెచ్చరిస్తుంది. పది రూపాయల నాణ్యాలు బయట వ్యాపారులు ఎవరు తీసుకోకపోవడంతో బ్యాంకుల్లోనే భారీ సంఖ్యలో ఉండిపోతున్నాయని పేర్కొంది. నాణ్యాల పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rbi