జీఎస్టీ అమలుకు వారం రోజుల ముందు పేటీఎం అదరగొట్టే ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  అంతే కాదు పేటీఎం క్యుఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులను అనుమతించే దుకాణాదారులకు పేటీఎం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు క్యుఆర్‌ కోడ్‌ ద్వారా నేరుగా తమ ఖాతాల్లోకి చెల్లింపులను దుకాణాదారులు అనుమతించవచ్చు.
Image result for paytm
ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. పేటీఎం క్యుఆర్‌ ద్వారా ఎక్కువ మంది వ్యాపారస్తులు కస్టమర్ల చెల్లింపులను అనుమతించేందుకు వీలుగా సంస్థ ఈ సదుపాయం కల్పిస్తోంది. తాజాగా భారతదేశంలో అతి పెద్ద మొబైల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వినియోగదారల కోసం మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ‘పేటీఎం లాయల్టీ పాయింట్స్’ అనే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. తమ ఎకో వ్యవస్థకు లోబడి ట్రాన్జాక్షన్స్ చేసినప్పుడు వినియోగదారులకు లభించే క్యాష్ బ్యాక్స్ పేటీఎం లాయల్టీ పాయింట్లుగా చేర్చబడతాయి.

ఈ పాయింట్లను కావలసినపుడు ఆన్ లైన్ ద్వారా లేదా పేటీఎం అనుమతించే 5 మిలియన్ల వాణిజ్య ఔట్ లెట్లలో కానీ రీడీమ్ చేసుకోవచ్చు. ఏ స్టోర్ అయినా పేటీఎం క్యూఆర్ ను స్కాన్ చేసి పేటీఎం లాయల్టీ పాయింట్స్ రీడీమ్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ మా వినియోగదారుల లావాదేవీలను కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంది మరియు మా భాగస్వాములకు వ్యాపారం అభివృద్ధిని చేస్తుంది’ అని పేటీఎం ఎస్విపి దీపక్ అబ్బాట్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: