చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. ఎంఐ టీవీ 4సి పేరిట 50 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ విడుదల కానున్న ఈ స్మార్ట్ టీవీ ఇప్పటికే ఎంఐ టీవీ సిరీస్ లో 4, 4ఏ, 4ఎస్ మోడళ్లను విడుదల చేసింది. చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ టీవీ.. త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానుందని ఎమ్ఐ వెల్లడించింది. ఈ టీవీ ధర రూ.22,700లని సదరు సంస్థ ప్రకటించింది.
ఇప్పటివరకు లాంచ్ చేసిన టీవీల వివరాలు
కాగా చైనా ఇప్పుడు లాంచ్ చేసిన ఎంఐ టీవీ 4సి కేవలం రూ.22,700 లకే లభించనుంది. ఇప్పటికే ఇండియా మార్కెట్లో షియోమి టీవీలో అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. సో ఆ అమ్మకాల్లో ఇప్పుడు లాంచ్ అయిన Mi TV 4C కూడా భాగం కానుంది. కాగా 4కె టీవీలో 50 ఇంచుల డిస్‌ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Mi TV 4A 43-Inch, Mi TV 4A 32-Inch ధరలు

షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్ 50" డిస్‌ప్లే సైజ్ (4K HDR), 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 178 డిగ్రీల వీక్షణ కోణం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2 3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు, హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్ 


మరింత సమాచారం తెలుసుకోండి: