రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై కేరళ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. చమురు ఉత్పత్తులపై రాష్ట్రం విధిస్తున్న పన్నును తగ్గిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు ఒక రూపాయి చొప్పున తగ్గించాలని పినరయి విజయన్ సర్కార్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 
Kerala to cut taxes, petrol, diesel to reduce, retail prices
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పదిహేడు రోజులుగా పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు మంగళవారం కేవలం ఒక పైసా తగ్గించడంపై కస్టమర్లు తీవ్ర అసహనం చూపుతున్నారు. కాగా, ఇప్పటికే కేరళలో పెట్రోల్‌పై 32.2శాతం, డీజిల్‌పై 25.58శాతం పన్నులను వసూలు చేస్తున్నారు.

ఇండియన్‌ ఆయిల్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం త్రివేండ్రంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.61 ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.19 వరకు ఉంది.  ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలకు పగ్గాలు వేసే విషయంలో పక్షం రోజులుగా మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, కేరళ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: