బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ భారీ ఊరట కల్పించింది. నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ల ద్వారా చేపట్టే ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని ఖాతాదారులకు మళ్లించాలని ఆర్‌బీఐ కోరింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా గురువారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది.


డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. భారీగా నిధుల బదిలీని చేపట్టే ఆర్టీజీఎస్‌, ఇతర నిధుల బదిలీల కోసం నెఫ్ట్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కనీస మొత్తాన్ని వసూలు చేస్తోంది. బ్యాంకులు ఈ చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆన్‌లైన్‌ నగదు ట్రాన్స్‌ఫర్‌ చేపట్టే కస్టమర్లకు ఊరట కలగనుంది. కాగా, మరో వారంలో దీనిపై బ్యాంకులకు నిర్ధిష్ట ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: