మీరు 17 చెట్లను కాపాడాలనుకుంటున్నారా ?ఒక టన్ను పేపర్‌ రీస్లైకింగ్‌ చేయడం ద్వారా అది నెరవేరుతుంది. నెలకు60 వాట్ల విద్యుత్‌ను ఆదా చేయాలనుకుంటున్నారా ? ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ రీసైక్లింగ్‌ చేయండి. ఇలా మన చుట్టూ ఉండే చెత్త వల్ల ప్రయోజనాలను ప్రజలకు సోషల్‌ మీడియాలో వివరిస్తూనే ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్‌ చేస్తామంటున్నారు హైదరాబాద్‌కి చెందిన బిందు, లత, రీతూలు.

ఈ ముగ్గురు చెత్తకు కొత్త పరిష్కారం చూపే 'స్క్రాప్‌క్యూ' ని ప్రారంభించారు. ఇళ్లలో పేరుకు పోయే, పాత పేపర్లు, ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను కొంటూ, ప్రతీ ఇంటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు, ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. చెత్త రీసైక్లింగ్‌ కోసం ముందుగా కొన్ని పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు.

చెత్తతో మేలంటూ ప్రచారం.. ఇంట్లో శుభ్రతకు ఈ చెత్త ఎప్పుడూ అడ్డే. నగరంలో ఎక్కువ మంది అద్దెదారులే. దీంతో ఆ చెత్తను ఉన్న ఇంట్లోనే ఓ మూలన పారేసి, చెత్త కొనేవారి కోసం ఎదురుచూస్తుంటారు. ఆంతర్జాతీయ ఖ్యాతి నొందిన నగరంలో చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్థాలను, రీసైక్లింగ్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ యువతులు ప్రజలకు వివరిస్తున్నారు.

వీరు సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం ఎంచుకున్నారు. ఆ తర్వాత కాలనీలు, వీధుల్లో ప్రజలకు అవగాహన కలిగిస్తూ, ఇంటి ఇంటికీ వెళ్లి చెత్త విశిష్టతను తెలియజేస్తూ వాటిని పడేయవద్దని చెబుతున్నారు. ఒక మిస్డ్‌ కాల్‌తో మీ ఇంటికి.. 'మీ ఇంట్లో పేరుకు పోయిన చెత్త, వ్యర్థాలు ఉంటే 040 - 30707070 నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వండి. వీరి సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్త కొంటారు అంటున్నారు, ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టిన ఈ యువ టీమ్‌.

'' ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను విసిరిస్తే అది భూమిలో కలవడానికి 500 ఏళ్లు పడుతుంది.'' అనే సత్యం గ్రహిస్తే మనం పర్మావరణం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్ధం అవుతుంది. 

Call to... ,90 30 72 72 77, Missed Call 040 30 70 70 70,  Send a message to 90 30 72 72 77, WhatsApp us to 90 30 72 72 7

.................................................................................................................................




మరింత సమాచారం తెలుసుకోండి: