ప్రముఖ ఇంగ్లీష్ మీడియా సంస్థ ఇండియా టుడే దేశం లో ఉన్న అత్యంత శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది ఈ ఏడాది చేసిన సర్వే లో తొలి యాభై మంది శక్తిమంతులతో కూడిన జాబితాను ఇండియా టుడే తన ఆగస్టు మ్యాగజైన్ లో ప్రచురించారు.అయితే ఈ జాబితా లో వున్న వారిలో పదమూడు మంది వ్యక్తులు రెండు వేల మూడు నుంచి టాప్ ఫిఫ్టీలో కొనసాగుతున్న వారేనని పేర్కొన్నారు.


ఇందులో ఇరవై ఏడు మంది వ్యాపారవేత్తల ఉండటం గమనార్హం.అత్యంత శక్తిమంతమైన జాబితాలో ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదానీ, ఉదయ్ కోటక్ ఆనంద్ మహీంద్రా, రతన్ టాటా సన్స్, విరాట్ కోహ్లీ ,ఎన్ చంద్రశేఖరన్,అమితాబ్ బచ్చన్ ,శివనాడార్ అజయ్ పిరమాల్ అజీమ్ ప్రేమ్ జీ సజ్జన్ జిందాల్ అనిల్ అగర్వాల్ ఉదయ్ శంకర్ అమిత్ అగర్వాల్  శ్రీశ్రీ రవిశంకర్ సంజీవ్ గోయంకా హరీశ్ సాల్వే సునిల్ భారతి మిట్టల్ ఉన్నారు.


కాగా ఇరవై మూడో స్థానం లో నీతా అంబానీ, ఇరవై తొమ్మిది వ స్థానం లో సల్మాన్ ఖాన్, నలభై రెండో స్థానం లో దీపికా పదుకొనే టాప్ ఫిఫ్టీలో కొనసాగుతున్నారు. దీనితో పాటు అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాను కూడా విడుదల చేశారు. కాగా ఈ జాబితాలో మోహన్ భగవత్ మినహా టాప్ టెన్ లో ఉన్నవారంతా బిజెపి నేతలే కావడం గమనార్హం.అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకు నరేంద్ర మోదీ అమిత్ షా, మోహన్ భగవత్, రాజ్ నాథ్ సింగ్ నితిన్ గడ్కరీలు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ యోగి ఆధిత్యనాథ్ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకాశ్ జావడేకర్ ఉన్నారు.

గతేడాది విడుదల చేసిన అత్యంత శక్తిమంతుల జాబితాలో ఇరవై రెండు మంది వ్యాపారవేత్తల ఉండగా ఈ సారి ఏకంగా ఐదుగురు వ్యాపారవేత్తల జాబితాలోకి చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి గా అపర కుబేరుడు ముఖేష్ అంబాని నిలవగా కుమార మంగళం బిర్లా రెండో స్థానంలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: